గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి మృతి

March 15, 2019

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం చెందారు. ఆయన వైసీపీ పార్టీ అధినేత జగన్‌కు చిన్నాన్న అవుతారు. పులివెందులలోని ఆయన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతిచెందారు. తెల్లవారుజామున బాత్‌రూమ్‌లో కుప్పకూలి ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించినట్లు తెలిసింది. ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఇటీవల గుండెపోటు రావడంతో ఆయన స్టెంట్ వేయించుకున్నారు. ఆయన హఠాన్మరణంతో జగన్ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. ఈరోజు సాయంత్రం పులివెందులలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె వున్నారు. 1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకానందరెడ్డి జన్మించారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన చిన్న తమ్ముడు అవుతారు.

YS Vivekananda Reddy dead with a heart attack

కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1999, 2004) ఎన్నికయ్యారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు (1989, 1994) రాజకీయాల్లో తన ముద్ర వేశారు. 2009లో సెప్టెంబర్‌లో ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడిగానూ పనిచేశారు. 2010లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.