వివేకానందది హత్యే.. మొత్తం ఏడు చోట్ల గాయాలు! - MicTv.in - Telugu News
mictv telugu

వివేకానందది హత్యే.. మొత్తం ఏడు చోట్ల గాయాలు!

March 15, 2019

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి అనుమానాస్పద మృతి అటు వైఎస్ కుటుంబంలో, ఇటు ఏపీ రాజకీయాల్లోను కలకలం రేపుతోంది. గాయాలు, తీవ్రరక్తస్రావాన్నిబట్టి అందరూ అనుమానిస్తున్నట్లు ఆయది హత్యేనని  హత్యేనని తెలిసింది.

వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్టులో వివేకా హత్యకు గురైనట్లు వెల్లడైంది. మీడియాకు అందించిన నివేదిక ప్రకారం.. ఆయన శరీరంపై  ఏడు చోట్ల కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయి. తల వెనుక భాగంలో బలమైన గాయమైంది. అక్కడి నుంచి రక్తస్రావం జరిగిది. నుదుటిపై రెండు చోట్ల కూడా కత్తి గాయాలున్నాయి. తొడ,  చేతి వేళ్లపైనా గాయాలయ్యాయి. సాధారణంగా గుండెపోటు వస్తే ఇన్ని గాయాలు కావడం అరుదని, పైగా ఇవి కత్తి గాయాలు కావడంతో హత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.