స్టీల్.. ప్లాస్టిక్.. ఇప్పుడు టప్పర్ వేర్ డబ్బాల్లో బాక్స్ లు పెట్టడం మామూలే. దానికి ఒక ప్రత్యేకమైన బ్యాగులో పెట్టి తీసుకెళ్లడం ఫ్యాషన్. కానీ ఇక్కడ కనిపిస్తున్నలంచ్ బ్యాగ్ కోసం 1.5 లక్షలు ఖర్చు పెట్టాల్సిందే! లగ్జరీ ఫ్యాషన్ అనేది ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్ గా ఫీలవుతున్నారు. కొత్త కొత్త డిజైన్లను కోరుకుంటున్నారు. అయితే పర్సు కూడా ఒక లంచ్ బాక్స్ లా డిజైన్ చేశారు. బాలెన్సియాగా ట్రాష్ పౌచ్ ను అచ్చం చెత్త డబ్బాలకు ఉపయోగించే థేలా వలె కనిపిస్తుంది. దీన్ని 1, 790 డాలర్లు అంటే సుమారు 1.4లక్షల రూపాయలకు పైగానే ధర పలుకుతుంది. ఇది విచిత్రమైన క్రాస్ బాడీ బ్యాగ్ తో ’పెయింట్ క్యానన్’ నుంచి అరువు తెచ్చుకున్నట్టు ఉంటుంది ఈ బ్యాగు.
విచిత్రమైన ఫ్యాషన్ ఆఫర్ ల జాబితాలో చేరడం వైవ్స్ సెయింట్ లారెంట్ టేక్ అవే బాక్స్ కి దక్కింది. ఇది లంచ్ బాక్స్ డిజైన్ నుంచి కాపీ కొట్టినట్టు ఉంటుంది. దూడ చర్మం తోలుతో రూపొందించబడిన ఈ బ్యాగు నలుపు, గోధుమ రంగులో లభిస్తుంది. సిల్వర్ టోన్ మెటల్ వైఎస్ఎల్ ఇనీషియల్స్, ఇంటీరియర్ ప్యాచ్ పాకెట్, బ్యాగును లైనింగ్ చేసే స్వెడ్ 1,890 డాలర్లకు రిటైల్ చేయబడింది. అంటే మన కరెన్సీలో 1.5 లక్ష రూపాయలు. ఇంకా బాగా గమనిస్తే ఈ బ్యాగ్ మెక్డొనాల్డ్స్ హ్యాపీ మీల్ బాక్స్ ని చూసినట్టుగానే కనిపిస్తుంది.
ఈ బ్యాగుకి 1.5 లక్షలు చెల్లిస్తే ఏం చేస్తారు అని నెటిజన్లను ప్రశ్నించారు. కొందరు.. ‘భోజనాన్ని అంత ఖరీదైన బ్యాగులో తీసుకెళ్లినప్పుడు బయట ఎలా భోజనం చేస్తారు?’ అని, మరికొందరు.. ‘నాకు ఇది నచ్చింది. కానీ లోపల ఉన్న తోలు తుడవగలిగేలా ఉండాలి’ అన్నారు. చాలామంది మాత్రం.. ‘మన భారతీయ తల్లులు టప్పర్ వేర్ డబ్బాలపై ఎంత మక్కువ చూపుతున్నారో పరిశీలించాం. వైఎస్ఎల్ నుంచి వచ్చిన ఈ టేక్ అవే బాక్స్ మనం ధైర్యంగా కొనుగోలు చేస్తే కచ్చితంగా మన తల్లులకు నిద్రలేని రాత్రులు గడుపుతారు’ అంటూ కామెంటారు.