వైఎస్‌ఆర్‌ బీమా పథకం ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

వైఎస్‌ఆర్‌ బీమా పథకం ప్రారంభం

October 21, 2020

Ysr beema scheme started in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో ఆకర్షణీయమైన సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చారు. ఇటీవల ‘జగనన్న కానుక’ పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ‘వైఎస్‌ఆర్‌ బీమా’ పథకాన్ని తీసుకొచ్చారు. ఈరోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ ఈ పథకాన్ని‌ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఉచితంగా బీమా సదుపాయం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జయరాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘రాష్ట్రంలోని 1.41 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. బీమా నుంచి కేంద్ర ప్రభుత్వం తక్కుకుంది. అయినా కూడా మొత్తం ఖర్చును రాష్ట్రమే భరిస్తుంది. 18-50 ఏళ్ల మధ్య ఉన్నవారు మరణిస్తే రూ.5లక్షలు, 51-70 ఏళ్ల మధ్య ఉన్నవారు మరణిస్తే రూ.3లక్షలు, సహజ మరణానికి రూ.2లక్షలు, ప్రమాదవశాత్తూ పాక్షిక వైకల్యం కలిగితే రూ.1.50లక్షల బీమా వర్తిస్తుంది. ప్రమాదవశాత్తూ చనిపోతే తక్షణమే రూ.10వేలు అందిస్తాం.’ అని సీఎం జగన్ తెలిపారు. ఈ జాబితాలో పేర్లు లేనివారు గ్రామ సచివాలయానికి వెళ్లి నమోదు చేయించుకోవాలని సూచించారు.