వైఎస్సార్ బయోపిక్.. హీరో మమ్ముట్టి.. - MicTv.in - Telugu News
mictv telugu

వైఎస్సార్ బయోపిక్.. హీరో మమ్ముట్టి..

March 9, 2018

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ వస్తోందని కొన్ని రోజులుగా వార్తు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఆనందో బ్రహ్మ’ వంటి హారర్ కామెడీ చిత్రాన్ని రూపొందించిన మహి వి. రాఘవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైఎస్ఆర్ పాత్రలో ఏ నటుడ్ని తీసుకోవాలన్న దానిమీద అనేక ఊహాగానాలు వినబడుతున్నాయి. మళయాల సూపర్‌స్టార్ మమ్ముట్టి అయితే ఆ పాత్రకు న్యాయం చేస్తాడని, ఆయన్ని చిత్రబృందం సంప్రదించిందని, మమ్ముట్టి కూడా నటించటానికి సుముఖత వ్యక్తం చేసినట్టు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినబడుతున్నాయి.నయనతారను కూడా కథానాయికగా ఎంపిక చేసినట్టు వినబడుతున్న నేపథ్యంలో రాఘవ స్పందించాడు. ‘ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాకే నటీనటుల ఎంపిక ప్రక్రియ గురించి ఆలోచిస్తాం. మమ్ముట్టి, నయనతార విషయంలో వస్తున్న వార్తలు అవాస్తవం. మేమింకా ఎవరినీ సంప్రదించలేదు. స్క్రిప్ట్ ఇంకా మాకు సంతృప్తికరంగా లేదు. అది పకడ్బందీగా తయారయ్యాకే నటీనటుల గురించి ఆలోచిస్తాం. వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రొడక్షన్ పనుల్లోకి దిగనుంది ’ అని తెలిపాడు. శశిదేవి, విజయ్ చిల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.