కొడుక్కి పట్టాభిషేకం.. తండ్రికి రక్తాభిషేకం! - MicTv.in - Telugu News
mictv telugu

కొడుక్కి పట్టాభిషేకం.. తండ్రికి రక్తాభిషేకం!

May 25, 2019

క్షీరాభిషేకాలు, తైలాభిషేకాలు రొటీన్ అనుకున్నారు. ఏకంగా మేకను తీసుకొచ్చి గొంతు కోశారు. దాని రక్తం పట్టుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అభిషేకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు అత్యుత్సాహం ఇది.

https://www.facebook.com/satish.ravuri.9/videos/2362766893787612/

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడ ఆ రక్తాభిషేకం చేశారో తెలియడం లేదు. అయితే ఆ వ్యవహారం కొంతమంది తెలీక చేసిందని, పార్టీతో సంబంధం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో రచ్చసాగుతోంది.