జగన్ ప్రచారంలో అపశృతి.. గోడ కూలి 10మందికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ ప్రచారంలో అపశృతి.. గోడ కూలి 10మందికి గాయాలు

March 17, 2019

వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం విజయనగరం జిల్లా డెంకాడలో నిర్వహించిన ప్రచారంలో జగన్ ప్రసంగిస్తుండగా.. అక్కడే ఉన్న భవనం‌ గోడ కూలి 10 మందికి తీవ్రగాయలయ్యాయి. వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

YSR Congress Jagan campaign is fraudulent. Injured 10 People.

 

జగన్‌ను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తు తరలివచ్చి, చుట్టుపక్కల ఉన్న భవనాల పైకి ఎక్కి జగన్ ప్రసంగాన్ని వింటున్నారు. ఈ నేపథ్యంలో చిన్న తోపులాట జరిగి, భవనంపై ఉన్న గోడ కూలి భవనం కింద నిల్చున్న వారిపై ఇటుకలు పడి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఓ మహిళ కూడా ఉంది.