గెలుపును ముందే ఊహించాం.. హోదా సాధనే అజెండా: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

గెలుపును ముందే ఊహించాం.. హోదా సాధనే అజెండా: జగన్

May 23, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ స్థానాల్లోనూ విజయ దుంధుభి మోగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత గెలుపుపై స్పందించారు. తమను ప్రజలతోపాటు దేవుడు కూడా ఆశీర్వదించాడని పేర్కొన్నారు. ఫలితాలపై ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.

Ysr congress leader jagan mohan reddy say his election victory anticipated and special category status to Andhra Pradesh their priority.

‘ఏపీకి ప్రత్యేక హోదాను సాధించి పెట్టడమే మా పార్టీ  ఏకైక అజెండా. ప్రజలందకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని చెప్పారు. దేశంలో భారీ మెజారిటీ దిశగా సాగుతున్న ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పనితీరుపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 152, లోక్ సభలో 25 స్థానాల్లో వైసీపీ మెజారిటీతో సాగుతోంది. వైకాపా కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ నేత విజయసాయి రెడ్డి.. జగన్ నివాసానికి వెళ్లి ఆయనను అభినందించారు. ఘోర పరాజయం చవిచూసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ రోజు సాయంత్రం రాజీనామా చేయనున్నారు.