వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రసపుత్ర రజని వద్ద భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ దొరికింది. దీని వెనక పెద్ద ముఠానే ఉందని పోలీసులు భావిస్తున్నారు. రజనిని బెంగళూరులోని సుబ్రమణ్యపుర పోలీసులు అరెస్ట్ చేసి రూ. 44 లక్షల విలువైన రూ. 500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమెతోపాటు చరణ్ సింగ్ అనే అనుచరుడిని పట్టుకున్నారు. రజిని ఇదివరకు కూడా మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకుల వద్ద నుంచి డబ్బు గుంజినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బొందిలి కలస్తులకు చెందిన రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ ఈమె. ప్రభుత్వం మళ్లీ ఆ పదవిని ఆమెకే కట్టబెట్టింది. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రసపుత్ర రజిని దొంగనోట్ల రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమె అనంతపురం పట్టణానికి చెందిన కొందరితో కలసి ఫేక్ కరెన్సీ కొనుక్కుని బెంగళూరులో చలామణి చేస్తున్నట్లు తెలిసింది. రజని అరెస్ట్ కావడంతో ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. వైసీపీలో ఇలాంటి దొంగనోట్ల ముఠాలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కాగా ఈ రాకెట్లో తన పాత్రేమీ లేదని వైకాపాకు చెందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు.