Ysr congress mp avinash reddy slams suneeta rajasekhar in ys Vivekananda case second marriage with muslim
mictv telugu

వివేక హత్యకు రెండో పెళ్లే కారణం, ముస్లింకు పుట్టిన కొడుకును.. అవినాశ్ రెడ్డి

March 10, 2023

Ysr congress mp avinash reddy slams suneeta rajasekhar in ys Vivekananda case second marriage with muslim

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్రపన్నింది ఆయన సొంత అల్లుడు రాజశేఖరేనని, తాము తప్పించుకోవడానికి తనపై ప్రత్యారోపణలు చేస్తున్నారని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేక హత్య వెనక భారీ కుట్ర ఉందని, ఆస్తుల కోసమే ఆయనను చంపారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో సీబీఐ ఎదుట హాజరైన తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఇన్నాళ్లూ నేను మౌనంగా ఉన్నాను. ఇప్పుడు మా పార్టీ క్యాడర్ నన్ను ప్రశ్నిస్తోంది. నేనిక భరించలేను. ఊరుకోను. నేనూ మాట్లాడటం మొదలు పెడతా. అందరి బండారం బయటపెడతా. వివేక హత్యకు రెండో పెళ్లే కారణం. ఆయన 2005లో ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పుట్టిన కొడుకును తన రాజకీయ వారసుడిని చేద్దామనుకున్నాడు. తన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నాడు. ఆస్తులన్నీ రెండో భార్య పేరుపైన రాయాలనుకున్నారు. ఏవేవో అనుకున్నారు. ఆయన అనుకున్నదంతా చేస్తే ఆస్తులు రెండో భార్య సంతానానికి వెళ్తాయని కూతురు సునీత భర్త రాజశేఖర్ కుట్ర పన్నాడు. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖను మాయం చేశారు. వివేకది గుండెపోటు అని చెప్పకున్నా టీడీపీ అలా ప్రచారం చేశారు’’ అని అవినాశ్ చెప్పారు.