Ysr congress mp Gorantla madhav video
mictv telugu

గోరంట్ల మాధవ్ రియల్ న్యూడ్ వీడియో ఉంటేనే.. ఎస్పీ

August 10, 2022

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌దిగా చెబుతున్న న్యూడ్ కాల్ వీడియో వ్యవహారంపై పీటముడి పడింది. ఆయన ఒరిజినల్ వీడియో తమకు దొరలేదని, దొరికితే దాన్ని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపి నిజానిజాల నివేదిక తెప్పించుకోగలమని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప చెప్పారు.
వీడియోపై ఆయన బుధవారం సాయంత్రం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ‘వీడియో ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ జరిపాం. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియో ఒరిజినల్ వీడియో అని నిర్ధారించలేకపోతున్నాం. దాన్ని మార్ఫింగ్ చేసినట్లు అనుమానిస్తున్నాం. వీడియోలో ఉన్నది మాధవో కాదో చెప్పలేం. వీడియోపై ఆయన మాకు ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు. ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ లేబ్ కు పంపగలం’ అని ఎస్పీ చెప్పారు. మాధవ్ ఓ మహిళతో నగ్నంగా కూర్చుని అశ్లీల వీడియో కాల్ చేస్తున్నట్లు ఉన్న వీడియో బయటికి రావడం తెలిసిందే. అది తన జిమ్ వీడియో అని ఆయన అంటున్నారు.