తప్పులో కాలేసిన వైకాపా.. గాంధీకి తెల్లరంగేసి..  - MicTv.in - Telugu News
mictv telugu

తప్పులో కాలేసిన వైకాపా.. గాంధీకి తెల్లరంగేసి.. 

November 23, 2019

Ysr congress party colors to Gandhi statue 

ఆంధ్రప్రదేశ్‌లో రంగుల యుద్ధం జరుగుతోంది. అధికార వైకాపా కార్యకర్తలు అత్యుత్సాహంతో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం దిమ్మెకు పార్టీ రంగులు కొట్టిన వ్యహారంపై వివాదం రేగడం తెలిసిందే. విజయనగరం జిల్లా మొరకముడిదాం మండలం భైరిపురం పంచాయతీ కార్యాలయంలోఈ బొమ్మ ఉంది. జగన్ అధికారంలోకి రాగానే పంచాయతీ కార్యాలయాలకు, శ్మశానాలకు, చివరి గుళ్లకు కూడా ఆ పార్టీ రంగులు అద్దుతున్నారు. గాంధీ బొమ్మ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ విమర్శలు సంధించడంతో వైకాపా ఆత్మరక్షణ కోసం చాకచక్యంగా ఓ పని చేసి సోషల్ మీడియాకు అడ్డంగా దొరికి పరువు పోగొట్టుంది. 

గాంధీ బొమ్మ దిమ్మెకు వైకాపా రంగులు వేయనే లేదని, మీడియాలో వచ్చిన ఫొటోలను టీడీపీ, జనసేన పార్టీలు ఫొటోషాప్‌లో మార్చినవని ఈ రోజు ఓ ట్వీట్ చేసింది. అంతటితో ఆగకుండా దిమ్మెకు తెల్లరంగు ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేసి ఇదే అసలైన ఫొటో అని చెప్పుకొచ్చింది. అంతే..! ఈ ట్వీట్’పై తీవ్ర విమర్శలు వచ్చాయి. బొమ్మ వెనుక కార్యాలయంపై వైకాపా రంగులు అలాగే ఉండడం, దిమ్మెకు తెల్లరంగను తాజాగా పూసినట్లు ఉండడంతో పలువురు విమర్శలు సంధించారు.. దిమ్మెకు వైకాపా రంగులు పూసిన తర్వాత తీసిన వీడియోలను కూడా కొందరు అప్‌లోడ్ చేశారు. ఫోటోలను మార్చొచ్చుగాని, వీడియోలను మార్చలేం కదా అంటున్నారు.