వైసీపీలో అసమ్మతి సెగ.. పార్టీ కార్యాలయంపై దాడి - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీలో అసమ్మతి సెగ.. పార్టీ కార్యాలయంపై దాడి

March 17, 2019

వైఎస్సార్‌సీపీలో సీట్ల పంపకం జరగ్గానే అసమ్మతి సెగలు రాజుకున్నాయి. విశాఖలో వైసీపీ అసమ్మతి వర్గం ఆ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడింది. వైసీపీ విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త వంశీ కృష్ణ యాదవ్‌కు అధిష్ఠానం టికెట్ కేటాయించకపోవడంపై ఆయన అనుచరులు, మద్దతుదారులు వైసీపీ కార్యాలయంపై దాడికి యత్నించారు. పూల కుండీలు, అద్దాలను ధ్వంసం చేశారు.

YSR Congress party office destroyed mirrors. Vamshi supporters rallied For he had not been given ticket.

అనంతరం వంశీకృష్ణకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయం వద్దకు వెళ్లారు. సత్యనారాయణ కార్యాలయంపై కూడా దాడి చేసి, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు.

ఇన్నాళ్లు పార్టీకి సేవలందించిన వారిని పక్కన పెట్టి వేరెవరికో సీట్లు కేటాయిస్తే ఊరుకోం అని వంశీ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్ఠానం వంశీకి విశాఖ సీటు కేటాయించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని డిమాండ్ చేశారు.