కర్రలు, గొడ్డళ్లు.. ఫలితాలు వచ్చినా ఆగని హింస - MicTv.in - Telugu News
mictv telugu

కర్రలు, గొడ్డళ్లు.. ఫలితాలు వచ్చినా ఆగని హింస

May 25, 2019

ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడినా.. ఇంకా కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటునే ఉన్నాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామంలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

ఇరువర్గాల వారు కర్రలు, గొడ్డళ్లు, రాళ్లతో విచక్షణ‌రహితంగా దాడులు చేసుకున్నారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించి, గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్నారు.