వైఎస్ఆర్ కాపునేస్తానికి రూ.1101 కోట్లు.. ఏపీ కేబినేట్ నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

వైఎస్ఆర్ కాపునేస్తానికి రూ.1101 కోట్లు.. ఏపీ కేబినేట్ నిర్ణయం

November 27, 2019

 YSR Kapu Nestam for Rs1101 crore .. AP Cabinet decision

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. నవశకం సర్వే ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టు వెల్లడించారు. అలాగే ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పోరేషన్ ఏర్పాటుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. ఏపీఎస్‌పీడీసీఎల్‌ను విభజించి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 

కేబినేట్ భేటీలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు..

-సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డుల జారీకి కేబినేట్ ఆమోదం. రేషన్ కార్డుల అర్హతలు మార్పు. 25 ఎకరాల లోపు మెట్ట, 10 ఎకరాల లోపు మాగాణి, 2,50,000 వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. 

-ఒప్పంద ఉద్యోగుల అంశంపై కమిటీ ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం

-కడప ఉక్కు పరిశ్రమ ముడి సరుకు కోసం ఎన్ఎండీసీతో ఒప్పందానికి కేబినేట్ గ్రీన్ సిగ్నల్. జమ్మలమడుగు మండలం పెదదండ్లూరు వద్ద 3,200 ఎకరాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం. 

-టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంపు.

-జగనన్న వసతి దీవెన కింద రూ.2,300 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.3,400 కోట్లు కేటాయింపు. 

-ఒప్పంద ఉద్యోగుల అంశంపై కమిటీ ఏర్పాటుకు కేబినేట్ అంగీకారం.

-వైఎస్ఆర్ కాపునేస్తం పథకానికి రూ.1101 కోట్లు కేటాయింపు. కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.15 వేలు అందజేయాలని నిర్ణయం. 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75 వేలు అందజేతకు నిర్ణయం.