తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేవని చెబుతున్న కేసీఆర్.. తనతో కలిసి పాదయాత్రకు రావాలని వైఎస్‌ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసీఆర్ కోసం ఓ జత ‘షూ’ని గిఫ్ట్‌గా పంపించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తనతో నడవాలని కోరారు. కేసీఆర్ ఎలాంటి సమస్యలు లేవని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. సమస్యలున్నాయని తెలిస్తే కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం దళితుడిని సీఎం చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అధికారుంలోకి వచ్చేందుకు ఎన్ని హామీలను ఇచ్చి..ఇప్పుడు వాటిని విస్మరించారని దుయ్యబట్టారు. గతంలో నిలిచిన చోట నుంచే పాదయాత్ర ప్రారంభమవుతుందని షర్మిల స్పష్టం చేశారు.లోటస్ పాండ్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గవర్నర్ తమిళి సైతో భేటీ కావాలనుకున్నామని, అయితే.. పాదయాత్రకు ఆలస్యమవుతుండటంతో కలవలేకపోయినట్లు చెప్పారు.
పొంగులేటి చేరికపై
వైఎస్‌ఆర్టీపీ(YSRTP)లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేరికపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొంగులేటితో భేటీ అయినట్లు తెలిపారు. పార్టీలో చేరుతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారని స్పష్టం చేశారు. ఏ సమయంలో ఏది జరగాలో అదే జరుగుతుంది. ఏ సమయంలో చేరికలు ఉండాలో అప్పుడే ఉంటాయని షర్మిల వ్యాఖ్యానించారు.
పాదయాత్ర పున:ప్రారంభం
వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం అయ్యింది. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలోని శంకరం తండా గ్రామం నుండి మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. శంకరం తండా, లింగగిరి, సూరిపల్లి తండాల మీదుగా నెక్కొండ మండలం వరకూ పాదయాత్ర కొనసాగనుంది. షర్మిల ఈ రాత్రికి నెక్కొండలో బస చేస్తారు.
ఇవి కూడా చదవండి :
పొంగులేటితో భేటీ నిజమే.. త్వరలోనే YSRTPలోకి.: వైఎస్ షర్మిల
Breaking News : గ్రూప్-4 పరీక్ష షెడ్యూల్ విడుదల