ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. మొత్తం 18 స్థానాల్లో బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీ 1, ఓసీలకు 4 స్థానాలు కేటాయించింది. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక సంస్థల కోటాలో 9 మంది, గవర్నర్ కోటాలో 2 పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
స్థానిక సంస్థల కోటా
*నత్తు రామారావు (యాదవ)- శ్రీకాకుళం,
*కూడుకూడి సూర్యనారాయణ( శెట్టి బలిజ)-తూర్పు గోదావరి
*వంకా రవీంద్ర (కాపు)-ప.గో.జిల్లా
*కౌరు శ్రీనివాస్ (శెట్టి బలిజ)-ప.గో.జిల్లా
*మేరుగు మురళీధర్ (ఎస్సీ-మాల)-నెల్లూరు
*సిపాయిల సుబ్రమణ్యం(బీసీ)- చిత్తూరు
*పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (ఓసీ) -కడప
*మధుసూదన్ ( బోయ-బీసీ)-కర్నూలు
* మంగమ్మ (బీసీ-బోయ)- అనంతపురం
ఎమ్మెల్యే కోటా
పెనుమత్స సూర్యనారాయణ రాజు (ఓసీ)-విజయనగరం
పోతుల సునీత (బీసీ)-ప్రకాశం
కోలా గురువులు (బీసీ)-విశాఖ
బొమ్మి ఇజ్రాయిల్( ఎస్సీ)-తూర్పు గోదావరి
జయమంగళ వెంకటరమణ (బీసీ)-పశ్చిమ గోదావరి
చంద్రగిరి ఏసురత్నం (బీసీ)-గుంటూరు
మర్రి రాజశేఖర్ (ఓసీ)- గుంటూరు
గవర్నర్ కోటాలో
కుమ్మా రవిబాబు (ఎస్టీ) -అల్లూరి జిల్లా
కర్రె పద్మశ్రీ(బీసీ) -కాకినాడ