తాతను, నాన్నను, బాబాయిని, నన్నూ.. చంద్రబాబే: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

తాతను, నాన్నను, బాబాయిని, నన్నూ.. చంద్రబాబే: జగన్

March 15, 2019

తన బాబాయి వైఎస్ వివేకానంద అంతటి సౌమ్యుడు మరెవరూ లేదని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అంతటి సౌమ్యుడిని హత్య చేయడానికి ఎలా చేతులు వచ్చాయని అన్నారు. వివేకా హత్య అత్యంత దారుణమైన, నీచమైన రాజకీయ చర్య అని మండిపడ్డారు. తన తాత, తండ్రి, బాబాయి హత్యల వెనుక టీడీపీ, చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. 

YSRCP jagan mohan reddy blame chandrababu naidu for his uncle vivekananda murder rajashekar reddy

ఆయన ఈ రోజు పులివెందులలో బాబాయి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మా బాబాయిని ఒంటరిగా ఉన్నప్పుడు దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. వివేకానంద తాను చనిపోయే ముందు ఓ లేఖ రాశారని, అందులో డ్రైవర్ పేరు ఉందని పోలీసులు చెబుతున్నారు.. ఏంటిదంతా? ఏం చెప్పాలనుకుంటున్నారు?  వివేకా హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. మాకు చంద్రబాబు పోలీసులపై నమ్మకం లేదు. మా  తాత చనిపోయినప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు.. మా అబ్బను చంపితే మా నాన్న కడప దాటి రాలేడని అనుకున్నాడు.. తర్వాత అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని చంద్రబాబు మా నాన్నకు చాలెంజ్ విసిరాడు.. హెలికాప్టర్ ప్రమాదానికి రెండు రోజులు ముందు అలా అన్నాడు.. ఈనాడులోన అదే హెడ్డింగ్ వచ్చింది… మా నాన్నను చంపారు. నన్ను కూాడా చంపాలని చూశారు, ఎయిర్‌పోర్టులో నాపై దాడి చేశారు. ఇప్పుడు మా బాబాయిని చంపారు.. ’ అని అన్నారు.