జగన్ అక్రమాస్తుల కేసు మోదీ మెడకు.. మారిషస్ నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ అక్రమాస్తుల కేసు మోదీ మెడకు.. మారిషస్ నోటీసులు

February 22, 2018

తాడు లాడితే డొంక కదిలిందని సామెత. ఆ సంగతేమోగాని, వైకాపా అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో ఓ తీగ ప్రధాని మోదీ మెడకు చుట్టుకుంది. ఇందూ టెక్‌జోన్ ఐటీ సెజ్ కేసులో మారిషస్ ప్రభుత్వం.. మోదీని అంతర్జాతీయ కోర్టుకు లాగింది. తాము భారీగా నష్టపోయామని, న్యాయం చేయాలని నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. తమకు 5 కోట్ల డాలర్ల నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును కోరింది. మోదీ, భారత ఆర్థిక, వాణిజ్య పన్నులు, న్యాయ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు లీగల్ నోటీసులు జారీ చేసి, వారిని ప్రతివాదులుగా చేర్చింది.

తెలంగాణాకు కూడా..

ఈ ప్రాజెక్టులో తమ పెట్టుబడులకు విఘాతం కలిగిందంటూ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌కు లేఖ రాసింది మారిషస్. సీబీఐ, ఈడీ కేసుల వల్ల తమ పెట్టుబడులు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేసింది.  ఇందూ టెక్‌జోన్ ఐటీ సెజ్ కేసులో జగన్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి సహా పలువురిపై సీబీఐ చార్జిషీట్ దాఖలైంది. ఇందూ సెజ్ లో శ్యాం ప్రసాద్ రెడ్డి, మారిషస్ పెట్టుబడులు ఉన్నాయి. ఈ సెజ్‌లో మారిషస్‌కు 49 శాతం వాటా ఉంది. మారిషస్‌కు చెందిన కరీసా ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.115 కోట్లు పెట్టుబడులు పెట్టింది.