కోటి నా కొడుకులాంటోడు, ఎందుకిలా?: లక్ష్మీపార్వతి - MicTv.in - Telugu News
mictv telugu

కోటి నా కొడుకులాంటోడు, ఎందుకిలా?: లక్ష్మీపార్వతి

April 15, 2019

లైంగింక వేధింపులకు పాల్పడుతున్న తనపై కోటి అనే యువకుడు చేసిన ఆరోపణలపై వైకాపా నేత లక్ష్మీపార్వతి ఘాటుగా స్పందించారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆమె ఈ రోజు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చశారు.

YSRCP leader Lakshmi parvati complaints against Koti who alleged she harassed him obscene messages

‘పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. కోటిని నా బిడ్డలా భావించాను. కానీ అతడు ఇలా బుదర చల్లుతున్నాడు. గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న నన్ను కించపరుస్తున్నాడు. దీని వెనుకు ఎవరు ఉన్నారు? కోటీతో పాటు ఆరోపణలను ప్రచారం చేసిన టీవీ చానల్, యాంకర్లపైనా చర్యలు తీసుకోవాలి. దోషులను పట్టకుని, నా పరువు మర్యాదలు కాపాడాలి’ అని తాను డీజీపీని కోరినట్లు ఆమె విలేకర్లకు చెప్పారు.

లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందంటూ గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన కోటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె మొబైల్ ఫోనులో ఐ లవ్యూ, నన్ను పట్టించో అంటూ లైంగికంగా వేధింపులకు పాల్పడుతుతోందన్నాడు. వాట్సా‌ప్‌లో సెక్స్ వీడియోలు కూడా పంపుతోందని చెప్పాడు.