Ysrcp Leader Sajjala Ramakrishna Reddy Gives clarity On YCP lifetime President
mictv telugu

జగన్ శాశ్వత అధ్యక్ష పదవిపై వివాదం.. సజ్జల క్లారిటీ

September 22, 2022

ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకీ శాశ్వత అధ్యక్షుడు గానీ, శాశ్వత పదవులు గానీ వర్తించబోవని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పిన తరుణంలో.. వైసీపీ ఇమిడియట్‌గా రియాక్ట్ అయింది. ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ఎన్నుకోవడంపై వివరణ ఇవ్వాలని లేఖ రాయగా.. వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జీవిత కాల అధ్యక్ష పదవీ తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరస్కరించారని సజ్జల తెలిపారు. సీఎం జగన్‌ తిరస్కరించడం వల్ల ఆ నిర్ణయం మినిట్స్‌లోకి ఎక్కలేదన్నారు. దీంతో శాశ్వత అధ్యక్షుడు అనేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐదేళ్ల వరకు జగన్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని… ఆ తర్వాత పార్టీలో ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని తెలిపారు. జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవాలనేది నాయకుల, కార్యకర్తల ఆకాంక్ష మాత్రమేనన్నారు. శాశ్వత అధ్యక్షుడనే ప్రతిపాదనను జగన్ ఆ సమయంలోనే తిరస్కరించినట్లు చెప్పారు.