వైసీపీ నేత తనయుడిపై దాడి.. కిరోసిన్ పోసి - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీ నేత తనయుడిపై దాడి.. కిరోసిన్ పోసి

October 30, 2020

Ysrcp leader son incident

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. వైసీపీ నేత, మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ అచ్చాబా తనయుడు ఖాదర్‌ బాషాపై అతడి మొదటి భార్య హత్యాయత్నం చేసింది. బాషా ఇంట్లో ఉన్న సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో ఖాదర్‌ బాషాకు 40శాతానికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటన నుంచి తేరుకున్న కుటుంబ సభ్యులు బాషాను చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. 

బాషా మొదటి భార్య షాజియా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. మూడు నెలల క్రితం‌ షాజియా సొంత చెల్లెలును బాషా రెండో పెళ్లి చేసుకున్నాడు. భార్య షాజియాకు తెలియకుండా వేరొక కాపురం కూడా పెట్టాడు. ఈ విషయం షాజియాకు తెలియడంతో బాషాతో దూరంగా ఉంటోంది. ఈ విషయమై గత కొన్ని నెలలుగా ఆగ్రహంగా ఉన్న షాజియా భర్త ఖాదర్ భాషాపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు అధికార పార్టీ నేత తనయుడు కావడంతో ఈ వార్త ఏపీలో సంచలనం అవుతోంది.