ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని నివాసంలో ఇద్దరి మధ్య భేటీ జరిగింది.. దాదాపు రెండు గంటలకుపైగా ఇద్దరి మధ్య చర్చలు సాగాయి. ఆ తర్వాత ప్రెస్ మీట్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతూ.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులున్నాయని, ప్రజా జీవనం అంధకారంలో ఉందని అన్నారు. వ్యవస్థలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని, ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశం తర్వాత వైఎస్సార్సీపీ వీరిని టార్గెట్ చేసింది. ఆ పార్టీ నేతలు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆ పార్టీకి చెందిన స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి.. రాబోయే ఎన్నికల్లో పవన్-చంద్రబాబు పొత్తు పెట్టుకోబోతున్నారని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. టీడీపీ & జనసేన పొత్తులో చంద్రబాబును పవన్ కళ్యాణ్ అడుక్కుంటున్న 22 సీట్లు ఇవే అంటూ ఓ లిస్ట్ బయటపెట్టారు. మొత్తం 22 నియోజకవర్గాలను ట్వీట్ చేశారు. ఈ లిస్ట్ వైరల్‌గా మారింది. ఆ సీట్ల వివరాలు..
తెలుగుదేశం & జనసేన పొత్తు లో చంద్రబాబు ను పవన్ కళ్యాణ్ అడుక్కుంటున్న 22 సీట్లు ఇవే..
1. విశాఖ నార్త్
2. చోడవరం
3. గాజువాక
4. భీమిలి
5. యలమంచిలి
6.రాజానగరం
7. అమలాపురం
8.రాజోలు
9. కాకినాడ రూరల్
10. భీమవరం
11. నరసాపురం
12. తాడేపల్లి గూడెం
13. కైకలూరు
14. విజయవాడ పశ్చిమ
15. తెనాలి— VenkataReddy karmuru (@Venkat_karmuru) January 8, 2023
1. విశాఖ నార్త్
2. చోడవరం
3. గాజువాక
4. భీమిలి
5. యలమంచిలి
6.రాజానగరం
7. అమలాపురం
16. సత్తెనపల్లి
17. గుంటూరు పశ్చిమ
18. దర్శి
19. గిద్దలూరు
20. చీరాల
21. చిత్తూరు
22. తిరుపతిSource: YUVA Tv@JanaSenaParty
— VenkataReddy karmuru (@Venkat_karmuru) January 8, 2023
8.రాజోలు
9. కాకినాడ రూరల్
10. భీమవరం
11. నరసాపురం
12. తాడేపల్లి గూడెం
13. కైకలూరు
14. విజయవాడ పశ్చిమ
15. తెనాలి
16. సత్తెనపల్లి
17. గుంటూరు పశ్చిమ
18. దర్శి
19. గిద్దలూరు
20. చీరాల
21. చిత్తూరు
22. తిరుపతి
సొంత కొడుకు ను ఎలాగైనా ఎమ్మెల్యేగా చేసుకోవటం కోసం అద్దె కొడుకును ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతున్న 44 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు అంటూ మరో ట్వీట్ చేశారు వెంకటరెడ్డి. ఈ ట్వీట్‌పై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ఘాటుగా స్పందించారు. వెంకటరెడ్డితో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుధీర్ఘ చర్చల తర్వాత నిర్ణయించిన నియోజకవర్గాల పేర్లు అంటూ కౌంటర్ ఇచ్చారు.