మోదీతో భేటీ అయిన వైఎస్ జగన్‌.. - MicTv.in - Telugu News
mictv telugu

మోదీతో భేటీ అయిన వైఎస్ జగన్‌..

May 26, 2019

Ysrcp Legislative leader YS Jagan Meeting With Prime Minister Narendra Modi.

ప్రధాని మోదీ‌తో వైసీపీ శాసనసభాపక్ష నేత జగన్ సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న జగన్.. నేరుగా మోదీ ఇటింకి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన సాయంవంటి అంశాలను.. జగన్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మోదీతో భేటీ అనంతరం జగన్ ప్రధాని నివాసం నుంచి ఏపీ భవన్‌కు వెళ్లి, ఏపీ భవన్ సిబ్బందితో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. జగన్ సాయంత్రం ఢిల్లీ నుంచి బయలు దేరి తిరుపతికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు.