వైకాపా ఎంపీల రాజీనామా.. టీడీపీకి జగన్ సవాల్ - MicTv.in - Telugu News
mictv telugu

వైకాపా ఎంపీల రాజీనామా.. టీడీపీకి జగన్ సవాల్

April 6, 2018

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెనక్కు తగ్గేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా శుక్రవారంవైకాపా ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. లోక్‌సభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాక లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజాన్‌ను కలిసి రాజీనామా లేఖలను సమర్పించారు. రాజీనామా చేసిన వారిలో మేకపాటి, వరప్రసాద్, మిధున్‌రెడ్డి, వైవీసుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారు. వాటిని ఆమె ఆమోదిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. రాజీనామాలకు ముందు..సంతకాలు చేసిన రాజీనామా పత్రాలను వైఎస్సార్‌ చిత్రం పాదాల వద్ద ఉంచి, నమస్కరించారు. అనంతరం పార్లమెంట్‌కు బయలుదేరారు. రాజనామాల తర్వాత వైకాపా ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిరాహార దీక్షకు దిగబోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఎంపీల దీక్షకు అనుమతినిచ్చింది.కాగా, తమ ఎంపీలు చెప్పిన మాట ప్రకారం రాజీనామా చేస్తున్నారని, దమ్ముంటే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని వైకాాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు.