గాంధీనే కాదు, గేదెలనూ వదలని వైసీపీ  - MicTv.in - Telugu News
mictv telugu

గాంధీనే కాదు, గేదెలనూ వదలని వైసీపీ 

November 28, 2019

YSRCP party colors for buffalo horns

‘ఇందుగలడు అందులేడను 

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి చూచిన 

అందందే గలడు దానవాగ్రణి వింటే’ 

అనే ఈ పద్యాన్ని మనం చదువుకున్నాం. అంటే ఇక్కడున్నవారు అక్కడలేరనే సందేహం వద్దు.. ప్రతీచోట ఉంటారు.. వారు సర్వాంతర్యామి’ అని అర్థం వస్తుంది. ఈ పద్యాన్ని వైసీపీ కార్యకర్తలు బాగా ఔపోసన చేసుకున్నట్టున్నారు. అందుకే తమ పార్టీ ఇక్కడా అక్కడా కాకుండా ప్రతీచోట కనిపించాలి, వినిపించాలి అని పంతం పెట్టుకున్నట్టున్నారు. మొన్నటికి మొన్న అనంతపురం జిల్లాలో జాతీయ జెండాను తుడిచేసి వైసీపీ రంగులు వేయడం ఎన్ని విమర్శలకు దారితీసిందో తెలిసిందే. అలాగే విజయనగరం జిల్లాలో జాతిపిత గాంధీ విగ్రహం కింద దిమ్మెకు కూడా పార్టీ రంగులు వేసి పార్టీ మీద తమ అతి అభిమానాన్ని చాటుకుని అభాసు పాలయ్యారు. 

ఇప్పుడు అది చాలదు అన్నట్టు మరో తీవ్రమైన అడుగు వేశారు ఆ పార్టీ కార్యకర్తలు. తాజాగా ప్రకాశం జిల్లాలో గేదెల కొమ్ములకు కూడా వైసీపీ రంగులు వేసి తమ అభిమానం పీక్స్ అని నిరూపించుకున్నారు. పర్చూరి నియోజకవర్గంలో దారిలో రెండు గేదెలు వెళ్తున్న సమయంలో వాటికి వైసీపీ రంగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై టీడీపీ, జనసేనలు ఎలా స్పందిస్తాయో చూడాలి.