జేసీపై మీసం తిప్పిన పోలీసుకు వైకాపా టికెట్.. - MicTv.in - Telugu News
mictv telugu

జేసీపై మీసం తిప్పిన పోలీసుకు వైకాపా టికెట్..

March 16, 2019

లోక్‌సభ ఎన్నికల కోసం తన అభ్యర్థుల తొలి జాబితాను వైకాపా ప్రకటించింది. 9 మంది అభ్యర్థుల వివరాలను పార్టీ నేతలు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో ప్రబోధానంద స్వామి ఆశ్రయం వివాదంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మీసాలు తిప్పుతూ నాలుక కోస్తా అని హెచ్చరించినన మాజీ పోలీసు అధికారుల సంఘం నాయకుడు గోరంట్ల మాధవ్‌కు కూడా టికెట్ దక్కింది. ఆయన హిందూపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. వివాదం తర్వాత ఆయన పదవికి రాజీనామా చేసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. తొలి జాబితాలో ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలకు చోటు దక్కింది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిలకు తిరిగి టికెట్ ఇచ్చారు. 

YSRCP releases first lift for lok sabha elections police officer gorantal madhav mend mustache gets hindupur ticket.

అభ్యర్థుల వివరాలు

అనంతపురం – తలారి రంగయ్య

అమలాపురం- చింతా అనూరాధ

కడప- అవినాష్ రెడ్డి

చిత్తూరు – రెడ్డెప్ప 

రాజంపేట – మిథున్ రెడ్డి.

హిందూపురం – గోరంట్ల మాధవ్

అరకు – మాధవి

బాపట్ల  నందిగం నరేశ్  

కర్నూలు – డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్