యువీ నువ్వు కేక పో... - MicTv.in - Telugu News
mictv telugu

యువీ నువ్వు కేక పో…

June 23, 2017

టీమిండియా సీనియర్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ మరో రికార్డ్ సాధించాడు. వెస్టిండీస్‌తో ఆడే వన్డే అతడి కేరీర్ లో 400వ వరల్డ్ మ్యాచ్. 40 టెస్టులు ఆడిన యువీ 33.92 సగటుతో 1900 పరుగులు చేశాడు. 301 వన్డేల్లో 36.78 సగటుతో 8,644 పరుగులు, 58 టీ20ల్లో 28.02 సగటుతో 1177 రన్స్ చేశాడు. విండీస్ తో ఆడే వన్డే అతడి కెరీర్‌లో 302వ వన్డే. భారత్‌లో సచిన్‌ తెందుల్కర్‌ (463 వన్డేలు), సౌరవ్‌ గంగూలీ (311), రాహుల్‌ ద్రవిడ్‌ (344), అజారుద్దీన్‌ (334) తర్వాత 300 వన్డేలు ఆడిన ఆటగాడు యువరాజే.