మళ్ళీ బ్యాట్ పట్టనున్న యువరాజ్! - MicTv.in - Telugu News
mictv telugu

మళ్ళీ బ్యాట్ పట్టనున్న యువరాజ్!

February 7, 2020

Yuvraj Singh.

ఇటీవల ఆస్ట్రేలియాలో సంభవించిన కార్చిచ్చులో ఎందరో మరణించారు. దాదాపు ఐదు కోట్ల జీవరాశి సజీవదహనం అయింది. కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. ప్రతిష్ఠాత్మక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో చారిటీ మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 

ఈ మ్యాచ్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని ‘బుష్‌ఫైర్’ బాధితులకు అందించనున్నారు. ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకు సచిన్ టెండూల్కర్, యువరాజ్‌ సింగ్‌లు సిడ్నీ వెళ్లారు. ఈ చారిటీ మ్యాచ్‌లో రికీపాంటింగ్ ఎలెవన్ జట్టుకు సచిన్ కోచ్‌గా వ్యవహరించనుండగా, గిల్‌క్రిస్ట్ జట్టులో యువరాజ్ సింగ్ ఆడనున్నాడు. ఈ చారిటీ మ్యాచ్ ఆడలేకపోతున్నట్టు ఆస్ట్రేలియా మాజీ లెగ్‌స్పిన్నర్ షేన్ వార్న్ గురువారం ప్రకటించాడు. కాగా, చారిటీ మ్యాచ్ శనివారం జరగాల్సి ఉండగా, సిడ్నీలో కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా మ్యాచ్‌ను ఆదివారానికి వాయిదా వేశారు.