Yuvraj Singh comes in support of under-fire Suryakumar Yadav with a heartwarming tweet,
mictv telugu

సూర్యకుమార్‌కు యువీ సపోర్ట్…అవకాశమిస్తే అద్భుతాలు అంటూ ట్వీట్

March 25, 2023

Yuvraj Singh comes in support of under-fire Suryakumar Yadav with a heartwarming tweet,

సూర్యకుమార్ యాదవ్…ఇప్పుడు ఎక్కడ చూసినా స్కై గురించే చర్చ జరుగుతోంది. టీ 20ల్లో విజృంభించే ఈ ఆటగాడు వన్డేలు, టెస్ట్‌లకు వచ్చేసరికి పరుగులు కోసం కష్టపడుతున్నాడు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌‌లో దారుణ ప్రదర్శన కనబర్చిచాడు. మూడు వన్డేల్లో కనీసం ఒక్క పరుగు చేయలేదు. మొదటి బంతికే మూడు సార్లు గోల్డన్ డక్ అయ్యాడు. మొదటి రెండు వన్డేల్లో స్టార్క్‌కు దొరికిపోగా, మూడో వన్డేలో అగర్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

టీ 20ల్లో నెం.1

పొట్టి ఫార్మెట్లో సూర్యకుమార్ యాదవ్ అలియాస్ స్కైది తిరుగులేని రికార్డు. ప్రస్తుతం ప్రపంచంలోనే నెం.1 టీ20 బ్యాట్స్‎మెన్‌గా ‌ ఉన్నాడు. ఒక్కసారి క్రీజ్ లో నిలబడితే సునామీ సృష్టించగలడు. పరుగుల వరద పారిస్తాడు. క్రీజ్‌లో నాట్యమాడుతూ పట్టపగలే బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. కానీ వన్డేల్లో మాత్రం సూర్యకుమార్ మెరుపుల మెరవట్లేదు. ఆస్ట్రేలియా సిరీస్ కాకుండనే అతడి వన్డే రికార్డులు పేలవంగా ఉన్నాయి. మొదటిలో బాగా రాణించినా తర్వాత పరుగులు చేసేందుకు శ్రమిస్తున్నాడు. జూలై 2021లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ 23 మ్యాచ్‌లలో 21 ఇన్నింగ్స్‌లలో 424 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

వన్డే ప్రదర్శనపై విమర్శలు

ఆస్ట్రేలియా పేలవ ప్రదర్శన అనంతరం మిస్టర్ 360ని భారత్ అభిమానులతో పాటు, మాజీలు టార్గెట్ చేస్తున్నారు. టీ20లకు తప్ప మిగతా ఫార్మెట్లకు పనికిరాడని విమర్శిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో సంజూశాంసన్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ కోసం శాంసన్‌ను సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. అయితే ఈ కష్ట సమయంలో సూర్యకుమార్‌ యాదవ్‌కు టీం ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ మద్దతు పలికాడు.సూర్యకుమార్‎కు మరిన్ని అవకాశాలివ్వాలని సూచించాడు.

యువీ సపోర్ట్ 

‘ప్రతి క్రీడాకారుడు తన కెరీర్‌లో ఎత్తుపల్లాలను చూస్తాడు. మనమందరం దీనిని అనుభవించాం. సూర్యకుమార్‌ యాదవ్‌ టీమ్‌ఇండియాకు కీలకమైన ఆటగాడని నేను నమ్ముతున్నాను. అతనికి మరిన్ని అవకాశాలిస్తే వన్డే ప్రపంచ కప్‌లో కీలక పాత్ర పోషిస్తాడు. సూర్యకుమార్‌ తప్పకుండా మళ్లీ ఫామ్‌ని అందుకుంటాడు’ అని యువరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశాడు.

చోటు కష్టమే..

ఈ ఏడాది అక్టోబర్‌- నవంబర్‌ మధ్య వన్డే ప్రపంచ కప్‌ జరగనుంది. ఈ మెగా టోర్నీకి భారత్‎లోనే జరగనుంది.ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ఆటకు దూరం కావడంతో వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ స్థానానికి లోటులేకపోయినా భవిష్యత్తులో మాత్రం కష్టమే. ప్రపంచ్ కప్ నాటికి వన్డేల్లో తనకు తాను నిరూపించకపోతే వరల్డ్ కప్ జట్టులో అతడి పేరు కనబడకపోవచ్చు. ఐపీఎల్‌-16 సీజన్‌లో రాణించడంపై సూర్యకుమార్‌ దృష్టిపెట్టాలి. అక్కడ రాణిస్తేనే తర్వాత జరిగే వన్డే సిరీస్‌లకు అతడిని ఎంపిక చేసే అవకాశాలుంటాయి.