యువరాజ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిటైర్మెంట్ వెనక్కి.. - MicTv.in - Telugu News
mictv telugu

యువరాజ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిటైర్మెంట్ వెనక్కి..

September 10, 2020

Yuvraj Singh Comes out of Retirement

తన ఆట తీరుతో గ్రౌండ్‌లో పరుగుల వరద పారించి ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నాడు క్రికెటర్ యువరాజ్ సింగ్. అతని అనారోగ్యం తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నాడు. దీంతో అతడి ఆట చూడలేమని చాలా మంది అభిమానులు బాధపడ్డారు. కానీ వారికి ఓ శుభవార్త వచ్చేసింది. యూవీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. పంజాబ్ క్రికెట్ సంఘం కార్యదర్శి పునీత్ బాలి అభ్యర్థనతో తిరిగి ఆడాలని అనుకుంటున్నట్టుగా వెల్లడించారు. అనుమతి కోసం ఆయన బీసీసీఐ చీఫ్ గంగూలీకి లేఖ రాశాడని బాలి వివరించారు.

 బ్యాట్ పట్టుకునేందు తనను బాలి అడిగినప్పుడు ఆలోచించానని యూవీ చెప్పారు. మూడు నాలుగు వారాల పాటు అన్ని ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. పంజాబ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడతానని పేర్కొన్నారు. ఇటీవల పంజాబ్ యువ ఆటగాళ్ల శిక్షణ సందర్భంగా యువరాజ్‌కు మళ్లీ ఆటపై మనసు మళ్లిందని పేర్కొన్నారు. పంజాబ్ తరుపున టీ 20 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. 

 2011 ప్రపంచ కప్‌లో సిరీస్ యువరాజ్ మంచి ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత 2012 లో క్యాన్సర్‌తో కెరీర్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 2013లో తిరిగి వచ్చి 2016 టీ 20 ప్రపంచ కప్ ఆడారు. 

అప్పటి నుంచి ఆటతీరు సరిగా లేకపోవడంతో 2019 ప్రపంచ కప్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు.కాగా 17 సంవత్సరాల క్రికెట్ కెరీర్‌లో యువరాజ్ 40 టెస్టులు, 304 వన్డేలులు ఆడారు. 4857 పరుగులు చేయడం విశేషం.