నటి ఫ్రంట్ ఫుట్ షాట్‌కి యువీ ఫిదా! - MicTv.in - Telugu News
mictv telugu

నటి ఫ్రంట్ ఫుట్ షాట్‌కి యువీ ఫిదా!

January 2, 2020

nbnfjb

బాలీవుడ్ నటి సయామీ ఖేర్ ఫ్రంట్ ఫుట్ డ్రైవ్ షాట్‌కి మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఫిదా అయ్యారు. గురువారం ట్విటర్‌లో సయామీ ఖేర్ ఒక వీడియో పోస్టు చేసింది. అందులో ఆమె ఫ్రంట్ ఫుట్ షాట్లు ఆడుతూ కనిపించారు. ఆ వీడియోకు 2020 ఆన్ ద ఫ్రంట్ ఫుట్ అనే క్యాప్షన్ పెట్టారు. 

ఈ వీడియో చూసిన మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సయామిని ప్రశంసించాడు. షాట్ బాగుందని రీట్వీట్ చేశాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యువరాజ్ సింగ్ నవంబర్‌లో దుబాయిలో జరిగిన టీ10 లీగ్‌లో పాల్గొన్నాడు. ఆ టోర్నీలో యువీ విఫలమైనా జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు.