దళితులను కించపరిచినందుకు యువరాజ్ సింగ్ క్షమాపణ  - MicTv.in - Telugu News
mictv telugu

దళితులను కించపరిచినందుకు యువరాజ్ సింగ్ క్షమాపణ 

June 5, 2020

Yuvraj Singh Issues Clarification After Calling Yuzvendra Chahal ‘Bhangi’

 దళితులను కించపరిచినందుకు యువరాజ్ సింగ్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారందరికీ క్షమాపణ చెబుతున్నామని శుక్రవారం ట్విటర్ వేదికగా యువరాజ్ క్షమాపణలు చెప్పారు. ‘కులం, రంగు, మతం, లింగం వంటి వ్యత్యాస్యాలను నేను పట్టించుకోనని, విశ్వసించనని మీ అందరికి స్పష్టంగా తెలియజేస్తున్నా. ప్రజల సంక్షేమం కోసమే నేను ఎల్లప్పుడూ  పరితపిస్తాను. ప్రతీ ఒక్కరికి గౌరవం ఇవ్వాలని, ఒకరికొకరం మర్యాదగా నడుచుకోవాలని భావిస్తా. నా సహచరులతో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని నాకు అర్థమైంది. ఏది ఏమైనా బాధ్యాతాయుతమైన భారతీయుడిగా నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే వారందరికి క్షమాపణలు తెలియజేస్తున్నా. నా వ్యాఖ్యల పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నా. దేశం, ప్రజల పట్ల నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు.— యువరాజ్ సింగ్’ అంటూ యువరాజ్ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

 కాగా, దళితులను కించపరిచేలా యువరాజ్ సింగ్ వ్యాఖ్యలు ఇటీవల పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. లైవ్‌లో రోహిత్ శర్మతో కలిసి మాట్లాడుతున్న సమయంలో స్పినర్ యుజ్వేంద్ర చాహల్‌పై ‘భాంగీ’ అంటూ కుల వివక్ష వ్యాఖ్యలు చేశాడని.. ఆయనపై పోలీస్ కేసు నమోదయింది. ఈ విషయమై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. పారిశుధ్య విధులు నిర్వహించే దళితులను కించపరచిన  యువరాజ్ వెంటనే క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. దీంతో యువరాజ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.