రిటైర్మెంట్‌ యోచనలో యువరాజ్ సింగ్ ! - MicTv.in - Telugu News
mictv telugu

రిటైర్మెంట్‌ యోచనలో యువరాజ్ సింగ్ !

May 20, 2019

Yuvraj Singh mulls retirement, may seek BCCI nod to compete in private T20 leagues.

టీం ఇండియా సీనియర్‌ క్రికెటర్‌, ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌ రిటైర్మెంట్‌ యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జట్టులో స్థానం కష్టమైన పరిస్థితుల్లో.. బీసీసీఐ అనుమతి తీసుకుని రిటైర్మెంట్‌ ప్రకటించాలని, అనంతరం విదేశాల్లో జరిగే టీ20 క్రికెట్‌పై దృష్టిసారించాలని యువీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గాయాలు, కేన్సర్‌కు చికిత్స కారణంగా బ్యాటింగ్‌ వాడి తగ్గడంతో క్రమంగా అతని ప్రభావం మసకబారింది. ఈనెలలో ఇంగ్లండ్‌లో జరగనున్న వరల్డ్‌ కప్‌లో అవకాశం వస్తుందని ఆశించిన యువరాజ్‌కు నిరాశే మిగిలింది.

ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కూడా సత్తా చాటలేకపోయాడు. ఇక టీమిండియా తరపున ఆడడం సాధ్యంకాదన్న నిర్ణయానికి వచ్చిన యువరాజ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడమే ఉత్తమమని అని భావిస్తున్నారట. ఇందుకోసం బీసీసీఐ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు. అనుమతి రాగానే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. యువరాజ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించినా బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే టీ20 పోటీల్లో పాల్గొంటాడని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. కాగా, యువరాజ్‌కు ఇప్పటికే యూరప్‌, కెనడాల్లో జరిగే టీ20 క్రికెట్‌లో ఆడేందుకు ఆహ్వానాలు అందుతున్నట్లు తెలుస్తోంది.