వీరిలో మీకు ఏ భామ, గర్ల్‌ఫ్రెండ్‌గా కావాలో చెప్పండి.. యువరాజ్ - MicTv.in - Telugu News
mictv telugu

వీరిలో మీకు ఏ భామ, గర్ల్‌ఫ్రెండ్‌గా కావాలో చెప్పండి.. యువరాజ్

June 23, 2020

Yuvraj Singh.

ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా అలరిస్తున్న యాప్ జెండర్- స్వాప్ ఫేస్ యాప్‌. ఈ యాప్‌.. ఆడవారు మగవారిగా, మగవారు ఆడవారిగా మారితే ఎలా ఉంటుందో మార్చి చూపిస్తుంది. దీనిని చాలామంది థ్రిల్లింగ్ యాప్ అంటూ ముఖాలను మార్చి చూసుకుని ఆనందిస్తున్నారు. ఈ యాప్‌లో మాజీ టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పలువురు టీమిండియా క్రికెటర్లను అమ్మాయిలుగా మార్చేశాడు. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. వీరిలో గర్ల్‌ఫ్రెండ్‌గా మీరు ఎవరిని ఎంచుకుంటారు..? సమాధానం రేపు చెప్తానని స్టేటస్ పెట్టాడు. 

ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. కొందరు ఆశ్చర్యకర ఎమోజీలు పంచుకుంటున్నారు. భలే ఉన్నారే మన క్రికెటర్లు అని అంటున్నారు. చాలామంది బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను తన గర్ల్‌ఫ్రెండ్‌గా చేసుకుంటానని చెప్పారు. హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. నా స్నేహితురాలుగా భువీని ఎంచుకుంటానని కామెంట్ చేశాడు. ఆశిష్ నెహ్రా భార్య రష్మా కూడా భువీ పేరునే చెప్పింది. మరికొందరు జడేజా, రహానే, కోహ్లీ, ధోని పేర్లు చెబుతున్నారు.