హిందీ డైలాగ్‌తో అదరకొట్టిన క్రిస్ గేల్‌ ఫన్నీ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

హిందీ డైలాగ్‌తో అదరకొట్టిన క్రిస్ గేల్‌ ఫన్నీ వీడియో

March 16, 2020

bvfgv

వెస్టిండీస్‌ క్రికెటర్ దిగ్గజం క్రిస్ గేల్‌ గ్రౌండ్‌లో ఎంత గంభీరంగా ఉంటాడో.. బయట అంతే ఫన్నీగా ఉంటాడు. చిన్న చిన్న ఫన్నీ చేష్టలు చేస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను నవ్విస్తూ ఉంటాడు. ఇటీవల టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ట్విటర్ ద్వారా షేర్ చేసిన ఓ వీడియోనే ఇందుకు చక్కటి ఉదాహరణ. 

ఆ వీడియోలో గేల్ సరదాగా ‘కాన్ఫిడెన్స్ మేరా.. కబర్ బనేగీ తేరీ’ అనే హిందీ డైలాగ్‌ చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ డైలాగ్ చెప్పడానికి గేల్ పడుతున్న తిప్పలు చూసి అక్కడ ఉన్నవాళ్లందరూ నవ్వు ఆపులేకపోయారు. గేల్ డైలాగ్ చెపుతున్న సమయంలో యువి దానిని వీడియో తీసాడు. ‘బాగా చెప్పావు కాకా’ అంటూ యువీ ఈ వీడియో పోస్ట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో క్రిస్ గేల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున ఆడనున్నాడు. కరోనా విజృంభణ కారణంగా ఐపీఎల్‌ ప్రారంభోత్సవం వచ్చే నెల 15వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే.