చహల్‌ టిక్‌టాక్ వీడియో వైరల్..నెటిజన్ల ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

చహల్‌ టిక్‌టాక్ వీడియో వైరల్..నెటిజన్ల ఆగ్రహం

March 19, 2020

cricket

టీమిండియా స్పిన్నర్ చాహల్ పిచ్‌పై ఎంత సీరియస్‌గా ఉంటాడో బయట అంతే ఫన్నీగా వ్యవహరిస్తుంటాడు. చాహల్ టీవీ ద్వారా నిత్యం అభిమానులకు వినోదాన్ని పంచుతుంటాడు. ఈ సందర్భంగా టిక్‌టాక్ వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. 

తాజాగా చాహల్ చేసిన ఓ టిక్‌టాక్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చహల్‌ను ఒక అమ్మాయి ఆటపట్టిస్తూ ఉంది. ఆ వీడియోపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. చాహల్ వేషాలు ఇంకా తగ్గలేదని కామెంట్లు పెడుతున్నారు. కరోనా వైరస్‌ ప్రబలుతోన్న తరుణంలో ఇంటికి పరిమితం కాకుండా ఇలా చేయడాన్ని తప్పుబడుతున్నారు. ప్రజలంతా రెగ్యులర్‌గా చేతుల్ని వాష్‌ చేసుకుంటూ ఇంటి పట్టునే ఉండాలని చాలా మంది క్రికెటర్లు అభిమానులకు పలు సూచనలు చేస్తుండగా, చహల్‌ మాత్రం అందుకు భిన్నంగా టిక్‌టాక్‌ వీడియో చేయడం నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తుంది.