Yuzvendra Chahal’s wife Dhanashree Verma’s dance on Telugu hit number is too good to miss
mictv telugu

హీరో నితిన్ పాటకు స్టార్ క్రికెటర్ సతీమణి ఊరమాస్ స్టెప్పులు

August 9, 2022

 

యంగ్ హీరో నితిన్‌ నటించిన లేటెస్ట్ చిత్రం.. మాచర్ల నియోజకవర్గంలోని ఓ మాస్‌ బీట్‌కు ఉత్సాహంగా స్టెప్పులేసింది టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ సతీమణి ధనశ్రీవర్మ. ఫేమస్‌ యూట్యూబర్‌ అండ్‌ కొరియోగ్రాఫర్‌ అయిన ఈ అందాల తార పలు హిట్‌ సాంగ్స్‌కు డ్యాన్స్‌లేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ తో పంచుకుంటుంది. తాజాగా ఓ తెలుగు పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది ధనశ్రీ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

‘మాచర్ల నియోజకవర్గం’లోని ‘రారా రెడ్డి ఐయామ్ రెడీ’ అనే పాటలో ఉన్న ‘రాను రానుఅంటూనే చిన్నదో.. చిన్నదో’ అనే మాస్ బీట్‌ను రీక్రియేట్‌ చేసింది. ఓవైపు పాట పాడుతూనే మరోవైపు ఊర మాస్ డ్యాన్స్ తో అదరగొట్టింది. అనంతరం తన డ్యాన్స్ వీడియోను నెట్టింట్లో పంచుకుంటూ ‘మీరు మాట్లాడక పోయినా.. మీలో ఉన్న శక్తి ఎప్పుడూ గట్టిగా మాట్లాడుతుంది’ అంటూ క్రేజీ క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘మీ ఎనర్జీ సూపర్‌ మేడ్‌’, ‘పవర్‌ ప్యాక్డ్‌ డ్యాన్స్‌’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.