zaheer khan restaurant bulding fire accident
mictv telugu

జహీర్ ఖాన్ రెస్టారెంట్ ఉన్న భవనంలో అగ్నిప్రమాదం

November 1, 2022

పూణెలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ ఉన్న ఓ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి.. లుల్లానగర్ చౌక్ లోని ఉన్న మార్వెల్ విస్టా భవనం పైఅంతస్తులో ఉదయం 9 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.

ఆ సమయంలో కిటికీలు, ఇతర వస్తువులు కిందపడ్డాయి.. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసారు.. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు. ఆస్తి నష్టంను అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక ఇదే బిల్డింగ్ లో జహీర్ ఖాన్ గత కొంతకాలంగా రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో జహీర్ రెస్టారెంట్‌కు ఏదైనా నష్టం వాటిల్లిందో లేదో తెలియాల్సి ఉంది..