ఆట షో తో బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన ఛానెల్ జీ టీవీ. ఒకప్పుడు కేవలం ఈ ఒక్క రియాలిటీ షో తోనే జీ టీవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత సరికొత్త సినిమాలు , సీరియల్స్‌తో ప్రజాదరణ పొందింది అది వేరే విషయం. తాజాగా ఆట డ్యాన్స్ రియాలిటీ షో ఫస్ట్ సీజన్ విన్నర్ టీనా మృతి చెందిదన్న విషయం కలకలం రేపుతోంది. ప్రముఖ యాంకర్ ఓంకార్ నిర్వహించిన ఆట డ్యాన్స్ షోతో పరిచయమైన టీనా.. ఆ తర్వాత సీజన్ 4కి జడ్జిగా కూడా వ్యవహరించింది. ఆవిడ గోవాలో మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మరణానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. టీనా సాధు మృతిచెందినట్లు ఆట సందీప్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. టీనా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ సందీప్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా ఇలా సడెన్ మరణించడంపై సర్వత్రా విషాద ఛాయలు అలుముకున్నాయి.