జీనత్ అమన్‌పై అత్యాచారం.. వ్యాపారి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

జీనత్ అమన్‌పై అత్యాచారం.. వ్యాపారి అరెస్ట్

March 23, 2018

తనపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని బాలీవుడ్ సీనియర్ నటి జీనత్‌ అమన్‌ చేసిన ఫిర్యాదుపై ముంబై పోలీసులు సర్ఫరాజ్ అలియాస్ అమన్ ఖన్నా అనే బడా వ్యాపారి అరెస్ట్ చేశారు. అతణ్ని కోర్టుకు హాజరుపరచి కేసును క్రైమ్ బ్రాంచికి అప్పగించామని శుక్రవారం తెలిపారు. జీనత్ గురువారం జుహూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మరుసటి రోజే అరెస్ట్ జరగడం విశేషం.

అమన్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డమే కాకుండా, కొన్ని నెలలుగా వెంటపడి వేధిస్తున్నాడని, అశ్లీల ఫోటోలు పంపుతున్నాడని 68 ఏళ్ల జీనత్ తెలిపింది. జనవరిలోనూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమన్, జీనత్ పరిచయస్తులేనని, అయితే కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చి గొడవపడ్డారని పోలీసులు చెబుతున్నారు. జీనత్..సత్యం శివం సుందరం, కుర్బానీ, అజ్‌నబీ తదితర చిత్రాల్లో అమితాబ్, వినోద్ ఖాన్నా, దేవానంద్ తదితరుల సరసన నటించి సెలబ్రిటీగా మారిపోయింది.