Zepto's Kaivalya Vohra youngest Indian with net worth above Rs 1,000 crore
mictv telugu

పేరు కైవల్య, వయసు 19, సంపాదన రూ.1000 కోట్లు

September 23, 2022

తెలివితేట‌లు ఉండాలే కానీ డ‌బ్బు సంపాదించ‌డం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించాడు జెప్టో స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు కైవ‌ల్య వోహ్రో. 19 ఏళ్లకే వ్యాపారవేత్తగా మారాడు. చిన్న కంపెనీగా మొదలుపెట్టి అనతి కాలంలోనే దేశం మొత్తం విస్తరించేలా చేశాడు. రూ. వెయ్యి కోట్ల నికర విలువ సాధించిన యువ వ్యాపారవేత్తగా రికార్డు సాధించాడు. క్విక్ డెలివరీ స్టార్టప్ ‘జెప్టో‘ సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా త‌న స్నేహితుడు ఆదిత్ పాలిచాతో కలిసి తను జెప్టోను ప్రారంభించాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ ఐఐఎఫ్ ఎల్ వెల్త్-హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో చోటు దక్కించుకున్న అతి పిన్న వయస్కులుగా నిలిచారు. కిరాణా వస్తువులు డెలివరీ చేసే ఈ జెప్టో యాప్ రూ.1000 కోట్ల నికర విలువతో కైవల్య వోహ్రాను ఈ జాబితాలో నిలిపింది. ఆదిత్ పలిచ వ్యవస్థాపకుడిగా, కైవల్య వోహ్రా సహ వ్యవస్థాపకుడిగా 2020లో ఈ యాప్ ప్రారంభమైంది.

కరోనా మహమ్మారి రోజుల్లో నిత్యావసర వస్తువులను త్వరగా, కాంటాక్ట్ లెస్ గా డెలివరీ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను నెరవేర్చడానికి వీళ్లు 2021లో జెప్టో ను ప్రారంభించారు. స్టాండ్‌ఫర్డ్ యూనివర్సిటీ డ్రాపౌట్స్ అయిన ఈ ఇద్దరు యువకులు ఒక సృజనాత్మక ఆలోచనతో Zepto స్థాపించి కోట్లు ఆర్జిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. మరోవైపు ఆ జాబితా ప్రకారం.. 1990ల్లో పుట్టిన 13 మంది యువకులు స్వయం కృషితో ఎదిగి కోటీశ్వరుల జాబితాలో నిలిచారు. మేలో, వైసీ కంటిన్యూటీ ఫండ్ నేతృత్వంలోని రౌండ్ నుండి Zepto 200 మిలియన్‌ డాలర్లను సేకరించింది. పెట్టుబడి తర్వాత, స్టార్ట్-అప్ దాని విలువను దాదాపు రెట్టింపు చేసి 900 మిలియన్ డాలర్ల మార్కును తాకింది. డిసెంబర్‌లో దీని విలువ 570 మిలియన్ డాలర్లుగా ఉంది. ‘పదేళ్ల కిందట మా జాబితాలో వెయ్యి కోట్ల నికర విలువ కలిగిన పిన్నవయస్కుడు 37 ఏళ్ల వ్యక్తి. కానీ, ఇప్పుడు 19 ఏళ్లకే కైవల్య వోహ్రా ఈ జాబితాలోకి వచ్చారు. ఇది దేశంలో స్టార్టప్ విప్లవం ప్రభావాన్ని సూచిస్తోంది’ అని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ పేర్కొంది.