తెరపైకి జీరో ఎఫ్ఐఆర్ డిమాండ్.. ఇంతకీ ఏంటది.? - MicTv.in - Telugu News
mictv telugu

తెరపైకి జీరో ఎఫ్ఐఆర్ డిమాండ్.. ఇంతకీ ఏంటది.?

November 30, 2019

Zero FIR..

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి ఘటన దేశ్యవాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అత్యంత పాశవికంగా జరిగిన ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇటువంటి ఘటనలు జరినప్పుడు స్పందించడం కాకుండా ఎవరైనా అమ్మాయిలు అపాయంలో ఉన్నప్పుడు వారికి రక్షణ కల్పించే ప్రత్యేక చట్టాలు తేవాల్సి ఉందనే డిమాండ్ ప్రధానంగా వినబడుతోంది. పోలీస్ స్టేషన్‌లో ఎవరైనా బాధితురాలు కేసు పెట్టినా.. ఫోన్ ద్వారా సమాచారం అందించినా తక్షణ స్పందించే విధానం తేవాలని అంటున్నారు. దీంట్లో ప్రధానంగా జీరో ఎఫ్ఐఆర్ అమలు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 

 

ఏంటీ జీరో ఎఫ్ఐఆర్ : 

సాధారణంగా ఎవరైనా మహిళలు అపహరణకు గురైనప్పుడు లేదా లైంగిక వేధింపులకు గురైనప్పుడు పోలీస్ స్టేషన్‌కు వెళితే అక్కడ పోలీసుల తీరు కొన్ని సార్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తమ పరిధిలోకి ఘటన జరిగిన ప్రాంతం రాదని అంటుంటారు. కానీ అటువంటి పరిస్థితి లేకుండా ఈ జీరో ఎఫ్ఐఆర్ అమలు చేయాల్సి ఉంటుందనే డిమాండ్ వినిపిస్తుంది. సాధారణ కేసుల్లో అయితే ఎఫ్ఐఆర్‌కు నంబర్ కేటాయించడం..స్టేషన్ పరిధి కూడా చూసుకుంటూ ఉంటారు. కానీ దీనికి అటువంటి నిబంధనలు ఏమీ దీనికి ఉండవు. 

జీరోఎఫ్ఐఆర్ అంటే ఎవరైనా బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌తో సంబంధం ఉండదు. వెంటనే కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి. బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు ప్రాథమిక దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అత్యవసరంగా కేసును టేకప్ చేయడానికి దీన్ని ప్రవేశపెట్టారు.ఢిల్లీలో నిర్భయ ఉదంతం తర్వాత జీరో ఎఫ్‌ఐఆర్‌కు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

మెడికో లీగల్‌ కేసుల్లో..బాధితులకు ధైర్యం నింపడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్‌ను సంబంధిత పోలీసులకు బదిలీ చేస్తారు. ప్రస్తుతానికి ఈ విధానం ముంబైలో అమలులో ఉంది. తాజా ఘటన తర్వాత హైదరాబాద్‌లో కూడా అమలు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.