zero star hotel opens in Switzerland
mictv telugu

మార్కెట్లో కొత్తగా ‘జీరో స్టార్ హోటల్’.. ఒక్క రోజుకి 28 వేలు

July 14, 2022

మనం ఇప్పటివరకు టుస్టార్, త్రీస్టార్, ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లు అని పేర్లు విన్నాం. కానీ, స్విట్జర్లాండుకి చెందిన ఇద్దరు వ్యక్తులు కొత్తగా జీరోస్టార్ హోటల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనికి రూం, గది పైకప్పు, ఏసీ, తలుపులు, ఏకాంతం వంటివి ఉండవు. వెనుకగా చిన్న గోడ ఉండి మొత్తం ఓపెన్‌గా ఉంటుంది. ఓ బెడ్, చిన్న టేబుల్, ల్యాంప్ మాత్రమే ఉంటాయి. పడుకొని నక్షత్రాలను, పగటిపూట వెలుతురును, రోడ్లపై పోయే వాహనాలను చూడొచ్చు. అయితే కావాల్సిన తిండి, ఇతర వస్తువులు ఏమైనా కావాలంటే సిబ్బంది తెచ్చి ఇస్తారు. మూడు చోట్ల ఇలాంటి హోటళ్లు ఏర్పాటు చేయగా, వాతావరణంలో వచ్చే కాలుష్యం, రణగొణ ధ్వనుల వల్ల భూమికి ఎంత నష్టం జరుగుతుందో చెప్పడమే దీని ఉద్దేశమంట. అయితే ఏమీ లేని జీరో హోటల్ అయినంత మాత్రాన డబ్బులు తక్కవేమీ తీసుకోరు. ఒక్కరోజు స్టే చేస్తే రూ. 28 వేలు ఫీజు చెల్లించాలి.