జికా..జికా..మనదాకా వచ్చేసిందా... - MicTv.in - Telugu News
mictv telugu

జికా..జికా..మనదాకా వచ్చేసిందా…

May 29, 2017

లాటీన్ అమెరికా, ఆఫ్రికా దేశాలను వణికించిన జికా వైరస్ హైదరాబాద్ దాకా వచ్చేసిందా…వచ్చేస్తుందా… ఎందుకైనా మంచిది అనుకున్నారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు… విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు.ఎయిర్‌పోర్టులో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులందరికీ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భారత్ లోకి ప్రవేశించిన జికా వైరస్ అహ్మదాబాద్‌లో బాపూనగర్‌కు చెందిన ముగ్గురికి సోకింది ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ధృవీకరించింది. బాధితుల్లో ఇద్దరు గర్భిణీలు ఇటివలే ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిచ్చారని గుజరాత్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు.