Zimbabwe is going to give a shock to India.. However, India will win
mictv telugu

భారత్‌కు షాక్ ఇవ్వబోయిన జింబాబ్వే..చివరికి భారత్‌దే విజయం

August 23, 2022

భారత్, జింబాబ్వే జట్ల మధ్య గతకొన్ని రోజులుగా వన్డే మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రెండు మ్యాచ్‌ల్లో భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన జింబాబ్వే జట్టు..సోమవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో భారత జట్టుకు షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది.భారత్‌పై జింబాబ్వే జట్టు గెలిచినంత పని చేసింది. 290 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు.. ఓపెనర్లు ఇన్నొసెంట్ కాయా (6), కైటానో (13) అంతగా శుభారంభం అందించలేదు.

అనంతరం బ్యాటింగ్ చేసిన.. షాన్ విలియమ్స్ ఒక్కడే (45) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు మున్యోంగా (15), చకాబ్వా (16), ర్యాన్ బర్ల్ (8), ల్యూక్ జాంగ్వే (14) కూడా రాణించలేదు. అయినా కూడా పట్టువదలకుండా పోరాడిన సికందర్ రజా (115) ఆ జట్టును గెలిపించినంత పని చేశాడు. అతనికి బ్రాడ్ ఇవాన్స్ (28) మంచి సహకారం అందించాడు. అంతలోనే శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్‌పట్టడంతో రజాను అవుట్ అయ్యాడు. దాంతో జింబాబ్వే ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. జింబాబ్వే జట్టు 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది.

ఇక, టీమిండియా బౌలర్లలో అవేష్ ఖాన్ 3, దీపక్ చహర్ 2, కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ 2, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో షాన్ విలియమ్స్ 45, బ్రాడ్ ఇవాన్స్ 28 పరుగులు చేశారు. అంతకుముందు, టాస్ గెలిచిన టీమిండియా మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మాన్ గిల్ (130) అద్భుతంగా ఆడి సెంచరీ చేశాడు. గిల్ సెంచరీ చేయడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. మూడో వన్డేలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గిల్‌ను వరించింది.