‘’ఎవలైతే నాకేంటి’’ అంటున్న జింబాబ్వే అధ్యక్షుడి భార్య! - MicTv.in - Telugu News
mictv telugu

‘’ఎవలైతే నాకేంటి’’ అంటున్న జింబాబ్వే అధ్యక్షుడి భార్య!

August 16, 2017

అధికారం చేతిలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనుకున్నట్టుంది జింబాబ్వే అధ్యక్షుడి భార్య. “అనువుగాని చోట అధికుల మనరాదు” అనే నానుడి తెలియదేమో ఆమెకి ? ముచ్చటేందంటే ..జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే భార్య గ్రేస్‌ ముగాబే అనారోగ్యం తో మెడికల్ పాస్‌పోర్టుపై తన కొడుకులతో పాటు ట్రీట్ మెంట్ కోసమని దక్షిణాఫ్రికా వచ్చిందట,

దక్షినాఫ్రికాలోని ఓ హోటళ్ల తన కొడుకులతో ఒక మోడల్ మాట్లాడిందట.అంతే ఆ మోడల్ పై కొరడాతో దాడికి దిగింది గ్రేస్ ముగాబే. ఆమె కొడుకులు అడ్డుపడుతున్నా వినకుండా మోడల్ ను పొట్టు పొట్టు చితక్కొట్టిందట.ఆమె ముష్ఠి ఘాతాల నుండి తప్పించుకున్న మోడల్ జోహెన్నెస్‌బర్గ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.వెంటనే పోలీసులు గ్రేస్ ముగాబే ను అరెస్ట్ చేయడానికి వెళ్తే అప్పటికే ఆమె జింబాబ్వేకు వెళ్ళిపోయిందట.ఈ ఘటనకి సంబంధించి  జింబాబ్వే విదేశాంగ మంత్రి తో చర్చించినట్లు దక్షినాఫ్రికా పోలీసులు తెలిపారు.గతం లో కూడా గ్రేస్ ముగాబే  హోటల్ లో ఒక వ్యక్తి పై దాడికి దిగి అక్కడి నుండి పారిపోయి తిరిగి జింబాబ్వే వచ్చిన సంఘటన ఉందని పోలీసులు చెప్పారు.