జిందగీ..! - MicTv.in - Telugu News
mictv telugu

జిందగీ..!

July 4, 2017

చంకలో చంటి బిడ్డ…నెత్తి మీద రోళ్ల బరువు,ఆమె మొఖంలో చెరగని చిరునవ్వు,అసలైన బతుకు చిత్రం అంటే ఇదేనేమో…గల్లీ గల్లీ తిర్గి నెత్తిమీదున్న బరువును  పైసలుగా మార్చేందుకు ఈ తల్లి చేస్తున్న జిందగీ ఫీట్ ఇది,ఈ ఫొటో చూసిన వారందరూ అయ్యో ఆ తల్లికెంత కష్టం అని అనికుంటుండచ్చు..కానీ  రాళ్లను రోళ్లుగా మలిచేటందుకు వారు పడే కష్టంలో ఇది ఎంత.

ఈ ఫోటో తీసింది సురేష్ గుండేటి … ఆకలి విలువను,కష్టం విలువను,బ్రతుకు విలువను,తల్లి ప్రేమను, ఈ ఒక్క ఫోటోతో అందర్కి తెలియజేశారు,ముఖ‌్యంగా ఆ తల్లి ముఖంలో చిరునవ్వును చూస్తుంటే..ఎన్ని కష్టాలచ్చినా ముఖంలో చిరునవ్వు చెదరనివ్కకు అని చెప్పకనే చెప్తుంది. పని శాతగాక,బద్దకంగా ఉంటూ, సోమరిపోతుల్లా బ్రతుకుతున్న వారు ఈ ఫోటోను చూసైనా సిగ్గు పడతారనే ఆశతో…