ధోని బిడ్డ వీడియో మళ్లీ వైరల్.. - MicTv.in - Telugu News
mictv telugu

ధోని బిడ్డ వీడియో మళ్లీ వైరల్..

November 25, 2017

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ముద్దుల కూతురు జీవా ఏం చేసినా వింతైపోతోంది. మొన్న ఆ బుజ్జిపిల్ల పాడిన మళయాళం పాట ‘అంబాలపుజాయ్‌ ఉన్నికన్నానోడు నీ’ నెటిజన్లను ఫిదా చేసింది. ఇప్పుడు జీవా చేసిన మరో పని కూడా వైరల్ అయింది.

జీవా తన చిట్టిచిట్టి చేతులతో పెద్ద అరిందాలా కూర్చుని గుండ్రటి రోటీ చేస్తున్న వీడియో ఆమె తల్లి సాక్షి నెట్టింటికి ఎక్కించింది. దీన్ని చూసినవారు లైక్ కొట్టకుండా, కామెంట్ చేయకుండా ఉండలేకపోతున్నారు. జీవా.. ఇటీవల క్రికెట్ స్టేడియంలో తన తండ్రికి నీళ్ల బాటిల్ అందిస్తున్న వీడియో కూడా నెటిజన్లను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అసలు బుజ్జిపిల్లల వీడియోలు ఎవరు మాత్రం ఇష్టపడరు. కల్లకపటమెరుగని వారి చిట్టిపొట్టిమాటలు చేతలు మనల్ని ఎంతగానో మురిపిస్తాయి కదా.