Zomato CEO Deepinder Bought new ferrari car cost 4.3 crores
mictv telugu

రూ. 4.3 కోట్ల విలువైన కార్లో.. జొమాటో సీఈఓ షికారు

March 3, 2023

Zomato CEO Deepinder Bought new ferrari car cost 4.3 crores

Zomato CEO  : సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ముఖ్యంగా పురుషులకు కారు మోజు అధికం. అల్ రెడీ హై ఫై కారున్నా, అందులో హాయిగా షికారు చేస్తున్నా మార్కెట్ లో ఏదైనా కొత్త మోడల్ వస్తే దానిని కొనుగోలు చేసేందుకు తెగ ఆరాటపడుతుంటారు. కొంతమందికైతే అది కొనే వరకు నిద్రకూడా పట్టదు. ఆ కోవకే వస్తారు జొమాటో సీఈఓ, వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్‌. భారత దేశంలో అతి కొద్ది మంది ధనవంతుల దగ్గర మాత్రమే ఉన్న లగ్జరీ కారును కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

దీపిందర్ గోయల్ కు హై ఎండ్ కార్లంటే మహా ఇష్టం. గోయల్ దగ్గర ఇప్పటికే విలాసవంతమైన కార్లు ఎన్నో ఉన్నాయి. అయినా తాజాగా ఈ లగ్జరీ కారును కొనుగోలు చేసి నెట్టింట్లో దాని పిక్ ను షేర్ చేసి హల్ చల్ చేస్తున్నాడు. రూ. 4.3 కోట్ల విలువైన సరికొత్త ఫెరారీ రోమా కార్ ను ఆన్-రోడ్ ప్రైజ్ కి కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. జొమాటో ప్రధాన కార్యాలయం ఉన్న హర్యానాలోని గురుగ్రామ్‌లోని రోడ్లపై కొత్త ఫెరారీ కారులో షికారు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఫెరారీ రోమా జొమాటో లోగో కలర్ అయిన రెడ్ కలర్ లోనే ఉంది. భారతీయ రోడ్లపై కొత్త ఫెరారీ మోడల్‌ కార్లు కొన్ని యూనిట్లు మాత్రమే ఉన్నాయి.తాజాగా జొమాటో సీఈఓ దానిని కొనుగోలు చేశాడు. ఈ న్యూ లగ్జరీ కార్ కు అద్భుతమైన డిజైన్స్ అందించారు. రోమా ఇంటిగ్రేటెడ్ డీఆర్ ఎల్ , నాలుగు టెయిల్ ల్యాంప్ లతో పాటు స్లిమ్ ఆర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ లు ఉన్నాయి. క్వాడ్-ఎగ్జాస్ట్ సెటప్ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ స్పాయిలర్‌ కూడా ఉంది. కొత్త ఫెరారీ రోమా క్యాబిన్ కూడా పాత ఫెరారీలతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. కారు డ్రైవర్ , కో-డ్రైవర్ కోసం రెండు వేర్వేరు సెల్‌లు ఉన్నాయి. సెంటర్ కన్సోల్‌లో 8.4-అంగుళాల టాబ్లెట్-శైలి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ కారుకు 16-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ , కెపాసిటివ్ బటన్‌లతో కొత్త స్టీరింగ్ వీల్‌ ను అమర్చి సరికొత్త లుక్ ను అందించారు.

లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం దీపిందర్ గోయల్‌ కు కొత్తేమి కాదు. ఇప్పటికే ఈ జొమాటో సీఈఓ దగ్గర లంబోర్ఘిని ఉరస్ , పోర్షే కార్లు ఉన్నాయి. భారతదేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న కార్లలో లంబోర్ఘిని కూడా ఒకటి. ఈ బ్రాండ్ దేశంలో ఇప్పటి వరకు 200 కార్లను ప్రముఖులకు డెలివరీ చేసింది. ఇండస్ట్రీలోని బడా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలకు ఈ కార్ ను డెలివరీ చేసింది. బాలీవుడ్ నటులు రణవీర్ సింగ్ , కార్తీక్ ఆర్యన్, అంబానీ ఫ్యామిలీకి చెందిన కొంత మంది దగ్గర ఈ లగ్జరీ కార్ ఉంది.